![]() |
![]() |
(1).webp)
అగ్నిపరీక్ష సీజన్ 2 లో టాప్ 15 ఓటింగ్ లో దూసుకెళ్తున్నది రోహిత్ నాయుడు. లేటెస్ట్ అఫీషియల్ పోల్స్ ప్రకారం రోహిత్ కు భారీ ఆధిక్యం ఉంది. రెండో స్థానంలో ఉన్న కంటెస్టెంట్ తో పోలిస్తే కూడా రోహిత్ కు భారీ లీడ్ కనిపిస్తోంది. అందుకే టాప్ 15 లిస్ట్ లో రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు.
రెండు, మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉంది. రెండో స్థానంలో RJ చరణ్ ఉన్నాడు. ఆయనకు 223 ఓట్లు అంటే 12.4% ఓటింగ్ వచ్చింది. మూడో స్థానంలో అమన్ మసూద్ ఉన్నారు. ఆయనకు 183 ఓట్లు, 10.2% వాటా లభించింది. చరణ్, అమన్ మధ్య తేడా చాలా తక్కువ ఉండటంతో చివరి వరకు స్థానాలు మారే ఛాన్స్ ఉంది. టాప్-3 తర్వాత ఓటింగ్ లో పెద్ద గ్యాప్ ఉంది. 4వ స్థానంలో రాజకుమారి దయానా 96 ఓట్లు 5.3% తో, 5వ స్థానంలో షాలిని పటేల్ 88 ఓట్లు 4.9% తో ఉన్నారు. ఆ తర్వాత మిస్ అపూర్వ 59 ఓట్లతో 6వ స్థానం, సింగర్ ఝాన్సీ 51 ఓట్లతో 7వ స్థానం, మిథిలేష్ 47 ఓట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఫైనల్ ఎంట్రీ ఓటింగ్ తో పాటు జడ్జీల ఎంపిక పైన కూడా ఆధారపడి ఉంటుంది. టాప్ 15 నుంచి టాప్-5 మంది మాత్రమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి వెళ్తారు. ప్రస్తుతం రోహిత్, చరణ్, అమన్ టాప్ 3 ఫేవరెట్స్ గా ఉండగా, షాలిని, శ్రష్టి, దయానాలకు జడ్జీల ఎంపిక ద్వారా ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది.
![]() |
![]() |